నాని కథానాయకుడిగా నటించిన 'ది ప్యారడైజ్' చిత్రం సెప్టెంబరు 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు రోజుకు 5 షోలు, సెప్టెంబరు 23న స్పెషల్ ప్రీమియర్లకు అనుమతి మంజూరు చేసింది. స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధర రూ.500 (జీఎస్టీతో సహా)గా నిర్ణయించారు. సెప్టెంబరు 24 నుంచి 27 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.48, సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 3 వరకు రూ.23 టికెట్ ధరలు ఉంటాయి. మల్టీప్లెక్స్‌లలో వరుసగా రూ.94, రూ.45 టికెట్ ధరలు నిర్ణయించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ రూ.కోటిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి అందజేసింది.