పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో కన్నవాళ్లే రోడ్డుపై వదిలేసిన చిన్నారికి వీధి కుక్కలు రక్షణగా నిలిచాయి. బుధవారం తెల్లవారుజామున రైల్వేవర్కర్స్ కాలనీలోని ఓ బాత్‌రూమ్ ఎదుట తల్లిదండ్రులు వదిలేసిన చిన్నారి చుట్టూ కుక్కలు చేరి, స్థానికులు గమనించేదాకా కాపలాగా ఉన్నాయి. స్థానికులు పసికందును ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.