
జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది 35 క్లౌడ్‌బరస్ట్‌లు.. 31 మంది మృతి
జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 35 క్లౌడ్‌బరస్ట్ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సుమారు 31 మంది ప్రాణాలు కోల్పోయారు, కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసమయ్యాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, ఎడతెరిపిలేని వర్షాలు, తరచూ క్లౌడ్‌బరస్ట్‌లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షాలకు కుప్వారా, షోపియాన్ ప్రాంతాల్లో మరో ఇద్దరు మరణించారు.




