
భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికెళ్తే 3 నెలల జైలు!
ఆఫ్ఘనిస్తాన్లో మహిళల స్వేచ్ఛపై తాలిబన్ ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. ఇటీవల తాలిబన్ల సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా మరో క్రిమినల్ కోడ్ను అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి భార్య వెళ్తే ఆమెకు 3 నెలల జైలు శిక్ష పడుతుంది. అలాగే భార్యలు, పిల్లలను భౌతికంగా శిక్షించే అధికారం భర్తలు, తండ్రులకు ఉంటుంది. అయితే, ఎముకలు విరగొద్దని, చర్మంపై ఏమాత్రం గాట్లు పడొద్దనే నిబంధనలు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ గాయాలైనట్లు ఆధారం ఉంటే మహిళ కోర్టును ఆశ్రయించొచ్చు.




