బ్లాక్ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.6,500?

0చూసినవారు
బ్లాక్ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.6,500?
వంట గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తున్నా అక్రమార్కులు ఆగడం లేదు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో పలు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ను రూ.6,500కు, 14 కేజీల రీఫిల్ కోసం రూ.3,500-రూ.4,000 వరకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు వెల్లడైంది. స్టవ్ రిపేర్ సెంటర్లు, కిరాణా దుకాణాల ద్వారా ఈ అక్రమ వ్యాపారం జరుగుతోందని, గ్యాస్ ఏజెన్సీలే వీరికి బ్లాక్లో గ్యాస్ సరఫరా చేస్తున్నాయని తేలింది. ఈ రాకెట్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్