ఇజ్రాయెల్ జరుపుతున్న తీవ్రమైన దాడులతో గాజా ఆర్థికంగా పూర్తిగా కుదేలైంది. ప్రజలు ఆహారం, ఇంధనం, ఔషధాల కోసం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. కరెన్సీ సరిగా లేక నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేజీ చక్కెర రూ.7 వేలు, లీటర్ పెట్రోల్ రూ.2 వేలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. “పిండి కొనుగోలు చేసేందుకు బంగారం అమ్ముకోవాల్సి వచ్చింది” అని షాహిద్ అజ్జూర్ అనే మెడికల్ షాప్ యజమాని వాపోయారు.