వచ్చే ఏడాది కల్లా కిలో వెండి ధర రూ.1.5లక్షలకు పెరిగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజా నివేదికలో పేర్కొంది. పెట్టుబడుల డిమాండ్‌కు తోడు, ఆభరణాల తయారీ రంగం, వాహన, పారిశ్రామిక రంగాలు వెండిని అధికంగా వినియోగిస్తున్నందునే దీని ధర పైపైకి వెళ్లడమే కానీ, కిందకు దిగివచ్చే సంకేతాలు రావట్లేదు. అందువల్లే ధర ఇంకా పెరిగి రూ.1.5 లక్షలకు చేరుతుందని ఈ నివేదిక పేర్కొంది.