TG: రాజకీయ నాయకులు నోరు జారుతుండడం కొత్తేమీ కాదు. కొందరు నేతలు పార్టీల పేరు తప్పుగా చెప్పడం లేదా ఇతర పార్టీల నేతల పేర్లు చెప్పే క్రమంలో తడబడుతుంటారు. అయితే పబ్లిక్ ప్రసంగాల్లో ఇలా నోరు జారితే అభాసుపాలవుతారు. తాజాగా చొప్పదండి సభలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 'మన దేశ ప్రధాని అమిత్ షా' అంటూ సీఎం రేవంత్సం బోధించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ATMగా మార్చుకుని KCR వేల కోట్లు దోచుకున్నారని, విచారణ చేసి ఆయనను బొక్కలో వేయాలని చెప్పే క్రమంలో ఇలా తడబడ్డారు.