ప్రైవసీగా గడిపితేనే ఆ నిర్మాత అవకాశం ఇస్తానన్నారు: అంకితా

65చూసినవారు
ప్రైవసీగా గడిపితేనే ఆ నిర్మాత అవకాశం ఇస్తానన్నారు: అంకితా
బాలీవుడ్ నటి అంకితా లోఖండే సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ వేధింపుల గురించి తాజాగా వెల్లడించారు. తన 19 ఏళ్ల వయసులో హీరోయిన్ కావాలనే కలలతో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఒక ఆడిషన్ తర్వాత సెలెక్ట్ చేశామని చెప్పి, కాంట్రాక్ట్ సంతకం చేయడానికి పిలిచారని తెలిపారు. ఆఫీస్‌కు వెళ్ళాక అసలు రూపం బయటపడిందని, తనను కాంప్రమైజ్ కావాలని డిమాండ్ చేశారని, నిర్మాతతో పడక పంచుకుంటే అవకాశం ఇస్తామని చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ధైర్యంగా నిలబడి గట్టిగా బుద్ధి చెప్పి, నిర్మాతకు కావాల్సింది టాలెంట్ కాదు, బెడ్ షేర్ చేసుకోవడానికి ఒక అమ్మాయి మాత్రమేనని, కానీ ఆ అమ్మాయిని తాను కాదని ముఖంపైనే చెప్పేసి బయటకు వచ్చేశానని అంకితా వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్