అమ్మకిచ్చిన మాటకోసం 150 డిగ్రీలు చేసిన ప్రొఫెసర్.. ఇంకా ఎన్ని చేయాలంటే!

61చూసినవారు
అమ్మకిచ్చిన మాటకోసం 150 డిగ్రీలు చేసిన ప్రొఫెసర్.. ఇంకా ఎన్ని చేయాలంటే!
చెన్నైకి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ పార్థిబన్‌ చదువు పట్ల చూపుతున్న ఆసక్తి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి 1981 నుంచి ఇప్పటివరకు ఆయన 150 డిగ్రీలు పూర్తి చేశారు. మొదటి డిగ్రీలో తక్కువ మార్కులు రావడంతో బాధపడిన తల్లికి, ఇకపై టాప్‌ మార్కులు తెచ్చుకుంటానని హామీ ఇచ్చి.. అప్పటి నుంచి నిరంతరంగా చదువుతూనే ఉన్నారు. ఆయన వయసు 60 ఏళ్లు. 200 డిగ్రీలు పూర్తిచేయడమే తన తదుపరి లక్ష్యమని పార్థిబన్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్