
వందేమాతరం నినాదాలు విని గూస్ బంప్స్ వచ్చాయి - తిలక్ వర్మ
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు రెచ్చగొట్టినా తన బ్యాట్‌తోనే జవాబిచ్చానని భారత క్రికెటర్ తిలక్ వర్మ తెలిపారు. ఒత్తిడితో కూడిన పరిస్థితులే కీలక ఇన్నింగ్స్‌కు ప్రేరణనిచ్చాయని, స్టాండ్స్‌లో వందేమాతరం నినాదాలు విని గూస్బంప్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాను గెలిపించిన తిలక్‌కు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనస్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తరపున ఆయనను సత్కరించారు.




