తమిళనాడు డీజీపీ జి.వెంకట్రామన్ ఆదివారం మాట్లాడుతూ, కరూర్‌లో సినీనటుడు విజయ్ పార్టీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు కారణాలను వివరించారు. విజయ్ పార్టీ నాయకులు 10,000 మందితో ర్యాలీకి అనుమతి కోరగా, అంతకు మించి అభిమానులు వస్తారని అంచనా వేశారు. సోషల్ మీడియాలో ముందుగా ప్రకటించిన సమయం కంటే ఆలస్యంగా విజయ్ రావడంతో భారీగా అభిమానులు గుమిగూడారు. అధికారులు 1.2 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించినా, ఈ దుర్ఘటన జరిగింది అని డీజీపీ వెల్లడించారు.