మోదీ విధానాల వల్లే రూపాయి పడిపోతుంది.. ఖర్గే విమర్శలు (వీడియో)

17చూసినవారు
భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోవడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గురువారం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్లే రూపాయి బలహీనపడుతోందని, ఇది దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్పష్టం చేస్తోందని అన్నారు. 2014కు ముందు రూపాయి విలువ పడిపోవడానికి సమాధానాలు చెప్పాలని మోదీ ప్రశ్నించినట్లే, ఇప్పుడు తాము కూడా ప్రధాని మోదీని అదే ప్రశ్నిస్తున్నామని, ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఖర్గే వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you