హిడ్మా ఎన్‌కౌంటర్‌పై విడుదల చేసిన లేఖలో పలు విషయాలు వెల్లడించిన మావోయిస్టులు అతని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరును లేఖలో ప్రస్తావించారు. లొంగిపోయిన పార్టీ సభ్యుడు 'కుసాల్' హిడ్మా కదలికలను పోలీసులకు సమాచారం ఇచ్చాడని తెలిపారు. మూడు రోజులు చిత్రహింసలు పెట్టారని నవంబర్ 18న ఆయనను, అనుచరులను ఎవరి కంటా పడకుండా మారెడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హతమార్చారని ధ్వజమెత్తారు.