
‘రుద్రం-2’ క్షిపణి పరీక్షలు సక్సెస్: రక్షణ శాఖ
డీఆర్డీవో అభివృద్ధి చేసిన ‘రుద్రం-2’ క్షిపణి పరీక్షలు చాందీపూర్ టెస్ట్ రేంజ్లో అత్యంత క్లిష్టమైన పథంలో విజయవంతంగా పూర్తయ్యాయని రక్షణ శాఖ పేర్కొంది. ఈ క్షిపణి వైమానిక దళంలో కీలక మార్పులు తెస్తుందని భావిస్తున్నారు. కొన్నేండ్లుగా వాడుతున్న రష్యా ‘కేహెచ్-31’ మిస్సైల్స్ స్థానంలో దీనిని ప్రవేశపెడుతున్నారు. ‘రుద్రం-2’ శబ్దవేగం కంటే 5.5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలదు.




