తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. నిర్మల్‌లో 46 డిగ్రీలు

36చూసినవారు
తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. నిర్మల్‌లో 46 డిగ్రీలు
తెలంగాణలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో 45.9, ఆదిలాబాద్ జిల్లా సాత్నాల‌లో 45.6, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 45.5 డిగ్రీలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని మేడిపల్లిలో 42.9, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 42.6, హిమాయత్‌నగర్‌లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్