ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత నౌకలు రహస్యంగా ప్రయాణిస్తూ గమ్యస్థానాలను చేరుకుంటున్నాయి. విదేశాంగ శాఖ, ఇరాన్ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ మన నౌకలను జలసంధి దాటిస్తున్నట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కీలక వివరాలను మంత్రిత్వ శాఖల అంతర్గత సమావేశంలో పంచుకున్నారు.