
యూట్యూబర్ అన్వేష్‌పై ఉక్రెయిన్ మహిళ లిదియా లక్ష్మి ఫైర్
యూట్యూబర్ 'నా అన్వేష్'పై ఉక్రెయిన్‌కు చెందిన హిందూ మహిళ లిదియా లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవతలపై అసభ్యకరంగా మాట్లాడిన అన్వేష్‌ను 'కన్వర్టెడ్ క్రిస్టియన్ గొర్రె'గా అభివర్ణించారు. అతడు ఎక్కడ ఏం చేస్తున్నాడో తనకు తెలుసని, అతని పతనం మొదలైందని హెచ్చరించారు. భగవద్గీత చదివినంత మాత్రాన సనాతన హిందువు కాలేరని, దేవతలను, గురువులను అవమానించడం తప్పు అని లిదియా లక్ష్మి పేర్కొన్నారు. అన్వేష్‌పై ఏపీ, తెలంగాణలో ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి.




