బర్మింగ్‌హామ్‌లో గులాబీ రంగులోకి మారిన ఆకాశం

12149చూసినవారు
బర్మింగ్‌హామ్‌లో గులాబీ రంగులోకి మారిన ఆకాశం
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ స్టేడియం వద్ద రాత్రిపూట ఆకాశం గులాబీ రంగులోకి మారిన సంఘటన ప్రజలను ఆశ్చర్యపరిచింది. సెయింట్ ఆండ్రూస్ స్టేడియంలో గులాబీ రంగు LED లైట్లు వెలిగించడం, దట్టమైన పొగమంచుతో కలిసి మేఘాలపై పడిన కాంతి ప్రతిబింబించడం వల్ల ఈ దృశ్యం ఏర్పడినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఆకాశం రంగు మారడం కాదని, కాంతి ప్రభావమని వివరించారు.

సంబంధిత పోస్ట్