
రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి సూసైడ్
TG: హైదరాబాద్ చర్లపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో తండ్రి, తల్లి, కుమార్తె ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




