చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటకు సర్వం సిద్ధమైంది. ఉదయం 9.30 గంటలకు వేలం ప్రారంభం కానుంది. ఈ ఏడాది వేలంలో పాల్గొనే వారి జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. వేలంలో అర్బన్ గ్రూప్‌కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, మార్రి రవికిరణ్ రెడ్డి, కందాడ శాలిని వీరేందర్ రెడ్డి, కంచర్ల శివారెడ్డి, లండన్‌కు చెందిన ది సుషీ కో. తరఫున సామ దయానంద్ రెడ్డి, సామ వరానంద్ రెడ్డి, జీఎన్‌ఆర్ డెవలపర్స్ గడ్డం నవీన్ రెడ్డి, పీఎస్‌కే గ్రూప్ శ్రీకాంత్, ఇబ్రహీం ప్రత్యూష్ పాల్గొననున్నారు. గతేడాది లడ్డూ రూ.35 లక్షలు పలకగా.. ఈసారి ఎంత ధర పలుకుతుందనేది ఆసక్తిగా మారింది.