
ఒకేసారి భారత్, అఫ్గాన్‌తో యుద్ధానికి సిద్ధం: పాకిస్థాన్ మంత్రి
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్, అఫ్గానిస్థాన్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్‌తో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, ‘‘ద్విముఖ యుద్ధానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉంది, వ్యూహాలు మన దగ్గర ఉన్నాయి. ఏక కాలంలో భారత్, అఫ్గాన్‌తో యుద్ధమ చేయడానికి సిద్ధం’’ అని తెలిపారు. పాక్‌లో నివసిస్తున్న అఫ్గాన్ శరణార్థులు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని, వెంటనే దేశం విడిచిపోవాలని హెచ్చరించారు.




