రాష్ట్ర రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సి వస్తుంది: కవిత

16చూసినవారు
రాష్ట్ర రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సి వస్తుంది: కవిత
తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, రోజువారీ ఖర్చుల కోసం ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సిన స్థితిలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. "కాగ్ 2024 - 25 నివేదిక ప్రకారం, రాష్ట్రం రూ.1.30 లక్షల కోట్ల అప్పు తెచ్చింది. నెలకు సుమారు రూ.12 వేల కోట్ల సొంత ఆదాయం ఉన్న మన రాష్ట్రంలో ఇప్పుడు రోజువారీ ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉంది. ఒక్కో కుటుంబంపై కాంగ్రెస్ సర్కార్ రూ.9 లక్షల అప్పు మోపింది. అయినా ఇంకా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమని చెప్పడం ప్రజలను మోసం చేయడమే" అని కవిత విమర్శించారు.

ట్యాగ్స్ :