ఢిల్లీలోని జంతర్‌మంతర్ పేరు వినగానే నిరసనలు, ప్రజా ఉద్యమాలు గుర్తొస్తాయి. అయితే 1724లో జైపూర్ మహారాజు సవాయి జైసింగ్-2 ఖగోళ పరిశోధనల కోసం నిర్మించిన ఈ కేంద్రం, కాలక్రమంలో ప్రజల సమస్యలకు గొంతుకగా మారింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, నిర్భయ ఘటన అనంతర ఆందోళనలు, రైతు ఉద్యమాలు, రెజ్లర్ల నిరసనలు, ఇటీవల
నీట్ పరీక్షలపై విద్యార్థుల ఆందోళనలకు ఇదే వేదికగా నిలిచింది.