దేశం మొత్తాన్ని ఒక 'వ్యవస్థ' తన గుప్పిట్లోకి తీసుకుందని,
విద్యార్థులు ప్రశ్నలు అడగడం దానికి ఇష్టం లేదని
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. శనివారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 'ఛాత్రోం కీ గూంజ్'లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రధాని
మోదీ చుట్టూ ఉండే వ్యక్తులు ప్రజా జీవనంలో అనేక అంశాలను నిర్దేశిస్తున్నారని విమర్శించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమాచార మార్పిడిని నియంత్రించడంతోపాటు గూఢచర్యానికి పాల్పడ్డారని ఆక్షేపించారు.