‘స్ట్రాంగ్ ఉమెన్’ పదమే దాదాపు తిట్టుగా మారిందని నటి తాప్సీ అన్నారు. ‘స్ట్రాంగ్ ఉమెన్’ అనే పదం దుర్వినియోగమవుతోందని, మహిళల బలాన్ని తీవ్రతకే పరిమితం చేయొద్దని కోరారు. ‘స్ట్రాంగ్ ఉమెన్’ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, బలమైన మహిళ అంటే ఇలా ఉండాలనే భావన వద్దని చెప్పుకొచ్చారు. హాస్యం, గ్లామర్ బలహీనతకు సంకేతాలు కావని స్పష్టం చేశారు.