ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే ఎల్నినో, లానినా ప్రభావాలను ఏడాది ముందుగానే అంచనా వేసే కొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పసిఫిక్ మహాసముద్రంలోని పరిస్థితులను విశ్లేషించడం ద్వారా 12 నెలల ముందే వాతావరణ మార్పులను అంచనా వేయవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఐఆర్ఓ, మెల్బోర్న్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 7,500కు పైగా పాత అంచనాలను విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే రైతులు కరవులు, వరదలను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవచ్చు. మరిన్ని
పరీక్షలు అవసరమని పరిశోధకులు తెలిపారు.