TG: కాంగ్రెస్ ప్రభుత్వంలో వరుసగా మంత్రుల పంచాయితీ ఆ పార్టీని కలవర పెడుతోంది. త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, మరోవైపు రిజర్వేషన్ల అంశం, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ పంచాయితీలు ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాజాగా మంత్రి వివేక్ వెంకటస్వామి, అడ్లూరి మధ్య వివాదం నెలకొంది. దీంతో అధిష్టానం చర్యలు చేపడుతుందా? ఏం జరగనుందనేది ఆసక్తిగా మారింది.