TG: సంగారెడ్డి(D) సిర్గాపూర్‌లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో సమస్యలు ఉన్నాయని విద్యార్థులు రోడ్డెక్కారు. అధికారులు హాస్టల్‌కు వచ్చి విచారణ జరపగా విద్యార్థులు వార్డెన్‌పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన వార్డెన్ విద్యార్థులపై బూతులతో రెచ్చిపోయాడు. హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి.. 'నా మీదనే ఫిర్యాదు చేస్తారా? వాళ్ల అన్నంలో విషం కలిపి చంపేయండి' అని చెప్పాడు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ వైరల్‌గా మారింది. దీంతో వార్డెన్ కిషన్ నాయక్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.