భారీ వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాం వద్ద కొండల నుంచి జాలువారుతున్న జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అందమైన దృశ్యం సందర్శకులకు కనువిందు చేస్తోంది. డ్యాం పరిసరాల్లోని ప్రకృతి అందాలు, జలపాతం వీక్షించడానికి అనేక మంది పర్యాటకులు తరలివస్తున్నారు.