మళ్లీ మోగనున్న పెళ్లి బాజాలు

18975చూసినవారు
మళ్లీ మోగనున్న పెళ్లి బాజాలు
గత కొన్ని వారాలుగా అధిక జ్యేష్ఠ మాసం కారణంగా నిలిచిపోయిన శుభకార్యాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. శూన్య మాసాల ప్రభావం దాటి, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ముహూర్తాల కాలం మళ్లీ వచ్చేసింది. జూన్ 16 నుంచి తెలుగు ఇళ్లలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. నిజ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం కావడంతో, జులై 12వ తేదీ బహుళ త్రయోదశి వరకు వరుసగా అత్యంత బలమైన సుముహూర్తాలు ఉన్నాయని ప్రముఖ వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న ముహూర్తాలు కావడంతో ప్రతీ రోజూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్