1995-2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా 9,700 ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, 8,32,000 మంది ప్రాణాలు కోల్పోయారని జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ నివేదిక వెల్లడించింది. ఈ వైపరీత్యాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. గత మూడు దశాబ్దాల్లో దేశంలో 430కి పైగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ప్రస్తుతం వెస్ట్రన్ డిస్ట్రబెన్స్‌ల ప్రభావం తగ్గడంతో ఉత్తర, మధ్య భారత్‌లో వర్షాలు తగ్గి, ఎండలు తీవ్రమవుతున్నాయి. దీని ప్రభావంతో దక్షిణాదిలోనూ వడగాడ్పులు వీస్తున్నాయి.