
మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగుబాటు
ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్, హోంమంత్రి సమక్షంలో మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగిపోయారు. ఆశన్నతో పాటు 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీఎం సమక్షంలో మావోయిస్టులు ఆయుధాలు అప్పగించారు. ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ కాగా ఆయన అసలు పేరు తక్కళ్లపల్లి వాసుదేవరావు. బీజాపూర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడుగా పని చేశారు. ఇటీవల మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన విషయం తెలిసిందే.




