అన్నను రోకలి బండతో తలపై కొట్టి చంపేసిన తమ్ముడు

17చూసినవారు
అన్నను రోకలి బండతో తలపై కొట్టి చంపేసిన తమ్ముడు
TG: ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలంలోని సాండ్రోన్‌పల్లి గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం రాత్రి తమ్ముడు మెండ్రన్ కుమార్, అన్న మెండ్రన్ గోపాల్‌ మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో కుమార్ రోకలిబండతో అన్న తలపై కొట్టాడు. దీంతో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you