TG: హైదరాబాద్‌లో మరో దారుణ హత్య జరిగింది. మియాపూర్ ప్రాంతంలో తమ్ముడు సొంత అన్ననే బండరాయితో కొట్టి చంపాడు. తరచూ తాగొచ్చి గొడవ పడుతున్నాడని బండరాయితో కొట్టి, కత్తితో పొడిచి హత్య చేశాడు. అన్న మద్యం మత్తులో ఉన్నప్పుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.