ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ ఇంట్లో దొంగలు పడ్డారు. శనివారం ఢిల్లీలోని ఆమె నివాసంలో చోరీ జరిగింది. మేరీ కోమ్ ఓ మారథాన్ ఈవెంట్‌లో పాల్గొనడానికి మేఘాలయ వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. దొంగిలించబడిన వస్తువులు, డబ్బు వివరాలు ఇంకా తెలియరాలేదు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.