ఇండోనేషియాలోని పపువాకు చెందిన కొరోవాయి తెగ ప్రజలు దట్టమైన అడవుల్లో చెట్లపైనే నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 10 నుంచి 50 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ఇళ్లు అడవి జంతువుల ముప్పు నుంచి రక్షణ కల్పిస్తాయని, చుట్టూ ఏం జరుగుతుందో గమనించడానికి వీలు కల్పిస్తాయని వారు భావిస్తున్నారు. కలప, ఆకులతో నిర్మించే ఈ ఇళ్లలోకి వెళ్లడానికి చెక్క నిచ్చెనలు ఉపయోగిస్తారు. వీరి జీవనశైలి సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.