ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో దారుణం జరిగింది. 2023లో భర్త విజేంద్ర యాదవ్‌ను కొంత మంది హత్య చేశారు. భర్త హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న భార్య రచనా యాదవ్‌ను కూడా చంపేశారు. శనివారం రాత్రి సమయంలో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకీతో గురిపెట్టి కాల్చి చంపేశారు. రచనా యాదవ్ భర్త విజేంద్ర యాదవ్ హత్య కేసులో ఐదుగురు నిందితులు ఉన్నారు. భర్తను హత్య చేసిన నిందితులే.. ఆమెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.