బియ్యానికి ప్రత్యామ్నాయంగా బార్లీ అద్భుతమైన పోషకాలను అందిస్తుంది. బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగి, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, గుండె జబ్బులను నివారిస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడమే కాక, కొలెస్ట్రాల్, అధిక బరువును అదుపులో ఉంచుతుందని నిపుణులు వివరిస్తున్నారు.