ఆ ఊరిలో ఇళ్లకు తాళాలు ఉండవు.. దొంగతనం జరగదు.. ఎక్కడో తెలుసా?

39చూసినవారు
ఆ ఊరిలో ఇళ్లకు తాళాలు ఉండవు.. దొంగతనం జరగదు.. ఎక్కడో తెలుసా?
నాగాలాండ్‌లోని ఖోనోమా గ్రామం భారతదేశంలో నిజాయితీ, నమ్మకానికి ప్రతీకగా నిలిచింది. కోహిమాకు సమీపంలో ఉన్న ఈ గ్రామంలో కొన్ని దుకాణాల్లో యజమానులు ఉండరు. కొనుగోలుదారులు తమకు కావాల్సిన వస్తువులు తీసుకుని, వాటి ధరను స్వయంగా పెట్టెలో వేసి వెళ్లిపోతారు. ఆశ్చర్యకరంగా ఇక్కడ దొంగతనాలు చాలా అరుదు. చిన్నప్పటి నుంచే నిజాయితీ, బాధ్యత, సామాజిక విలువలను బోధించడం వల్ల గ్రామస్తుల మధ్య బలమైన విశ్వాసం ఏర్పడింది. పర్యావరణ పరిరక్షణలో ముందుండే ఈ గ్రామాన్ని భారతదేశపు తొలి “గ్రీన్ విలేజ్”గా కూడా పిలుస్తారు. ప్రకృతి అందాలు, ప్రత్యేక జీవనశైలి కారణంగా ఖోనోమా ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది.

సంబంధిత పోస్ట్