మరికొన్ని నెలల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనకన్నా సీనియర్లు ఎవరూ లేరని, ఈ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల బరిలో దిగేందుకు తనకు అన్ని అర్హతలున్నాయని అన్నారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేనందున, తనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించి, మంత్రి పదవిని సైతం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని ఆయన డిమాండ్ చేశారు.