జనరిక్ ఔషధాలపై ఇప్పట్లో టారిఫ్‌లు ఉండవని తెలుస్తోంది. సెక్షన్ 232 కింద జనరిక్ మందులపై సుంకాల అంశంపై చర్చకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గం సుముఖంగా లేదని శ్వేతసౌధం ప్రతినిధి కుష్ దేశాయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శ్వేతసౌధం వర్గాలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్‌లో కథనం ప్రచురితమైంది. ఇది అమలులోకి వస్తే భారత ఔషధ కంపెనీలకు మేలు జరగనుంది. ప్రముఖ బ్రాండెడ్ ఔషధాలపై అక్టోబర్ 1న సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటించారు.