భారత్‌లో ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది జడ్జీలు!

62చూసినవారు
భారత్‌లో ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది జడ్జీలు!
భారతీయ న్యాయ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 22 మంది న్యాయమూర్తులే ఉండగా, ఇది అవసరమైన సంఖ్యకంటే చాలా తక్కువని న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా 2026 నాటికి కావాల్సిన జడ్జీల సంఖ్యను లెక్కించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 34 మందికి గానూ 33 మంది, హైకోర్టుల్లో 1122 స్థానాలకు 814 మంది మాత్రమే ఉన్నారు. ప్రతి 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు అవసరమని లా కమిషన్ సూచించింది.

ట్యాగ్స్ :