ప్రతిష్ఠాత్మకమైన టీ20 వరల్డ్‌కప్ 2026కు ఇంకా మూడు నెలల సమయం ఉండగా, భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారు. బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో క్లిప్‌లో, గంభీర్ మాట్లాడుతూ, 'మా డ్రెస్సింగ్ రూం పారదర్శకంగా ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ కోసం మేం పూర్తిగా సన్నద్ధం కావాల్సిఉంది. మన చేతిలో ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ ప్రాముఖ్యాన్ని ఆటగాళ్లంతా అర్థం చేసుకుంటారనుకుంటున్నా' అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.