సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేల్లో చనిపోయిన పుంజును 'కోజా'గా పిలుస్తారు. ఈ కోజాకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంది. సాధారణ నాటు కోడి పుంజుల ధర కంటే ఐదు రెట్లు అధికంగా, సైజును బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. దీని రుచికి భోజన ప్రియులు ఎంతగానో ఇష్టపడతారు. కొందరు కోజాను తినకపోతే సంక్రాంతి పండుగ జరుపుకున్నట్లుగా భావించరు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం ఎంత ఖర్చయినా కోజాలను కొనుగోలు చేస్తున్నారు.