TG: రాష్ట్రంలో కాంగ్రెస్,
బీజేపీ మధ్య అనుబంధం ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసాలపై జరిగిన ఈడీ సోదాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని
కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. పొంగులేటి నివాసానికి క్యాష్ కౌంటింగ్ మెషిన్లు తరలించారంటూ గతంలో వార్తలు వచ్చాయని, ఈడీ సోదాల ఫలితాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదని
కేటీఆర్ అన్నారు.