
ఈ నెల 4న క్రమశిక్షణ కమిటీ ముందుకు MP కేశినేని, MLA కొలికపూడి
AP: టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య తలెత్తిన విభేదాలపై పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇద్దరినీ విచారణకు పిలిచింది. ఈ నెల 4న ఉదయం 11 గంటలకు కొలికపూడి, సాయంత్రం 4 గంటలకు కేశినేని కమిటీ ముందుకు హాజరుకావాలని సూచించింది. అనుచరులు లేకుండా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.




