స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో బీసీ సంఘాల నేతలతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుల సర్వేకు ఆద్యులు రాహుల్ గాంధీ అని, స్వాతంత్య్రం అనంతరం శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించి అధికారిక పత్రాలు అందించామని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్‌కే కట్టుబడి ఉన్నామని, బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు.