తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ షార్టెజ్ లేదు: ప్రభుత్వం

5చూసినవారు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ షార్టెజ్ లేదు: ప్రభుత్వం
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ కొరతపై వస్తున్న ప్రచారాలకు పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రోజుకు సుమారు 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలోలీటర్ల డీజిల్ సరఫరా అవుతుండగా, మొత్తం 24,031 కిలోలీటర్ల ఇంధనం అందుబాటులో ఉందని వెల్లడించారు. అలాగే రోజుకు 2.22 లక్షల ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ జరుగుతోందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేసిన అధికారులు, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :