రామప్పకు ముప్పు లేదు: సింగరేణి యాజమాన్యం

3398చూసినవారు
రామప్పకు ముప్పు లేదు: సింగరేణి యాజమాన్యం
ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయానికి మైనింగ్ వల్ల ముప్పు పొంచి ఉందంటూ వస్తున్న కథనాలను సింగరేణి యాజమాన్యం ఖండించింది. అవి కేవలం అపోహలు, అవాస్తవాలు అని పేర్కొంది. ములుగు జిల్లా వెంకటాపూర్‌లో చేపట్టనున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప్రతిపాదన దశలోనే ఉందని, సమగ్ర అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, ప్రభుత్వ అనుమతులు వచ్చాకే ముందుకు వెళ్తామని తెలిపింది. బాధ్యతాయుతమైన సంస్థగా తెలంగాణ వారసత్వ సంపదకు నష్టం కలిగించే ప్రతిపాదన చేయదని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్